Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
బయోపిక్ లో నటిస్తున్న ‘భరత్‌ అనే నేను’ హీరోయిన్ !
Published on Jul 18, 2018 7:09 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్‌ అనే నేను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తెలుగు సినిమాలతో పాటు అటు బాలీవుడ్‌ చిత్రాలలోనూ కైరా సినిమాలు చేస్తున్నారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌ నిర్మిస్తున బయోపిక్ లో కైరా అద్వానీ నటించనుంది. వివరాల్లోకి వెళ్తే పరమవీర చక్ర బిరుదును పొందిన అమర జవాన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా కరుణ్ జోహార్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :