భరత్ అనే నేను లేటెస్ట్ కృష్ణా జిల్లా కలెక్షన్స్
Published on Apr 25, 2018 5:09 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ భరత్ అనే నేను. విడుదలయిన తొలి రోజునుండి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా, ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దాదాపు అన్ని ఏరియాల్లోను తొలివారం మంచి వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కృష్ణ జైళ్ళలో మొత్తంగా ఇప్పటివరకు రూ.4.16 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రానున్న రోజుల్లో పెద్ద సినిమాల విడుదలలు ఏవి లేవు కాబట్టి రానున్న ఇంకొన్ని రోజులపాటు భరత్ తన హవా కొనసాగించే అవకాశం కనపడుతోంది. మహేష్ సరసరా ఎమ్ ఎస్ ధోని ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దేవ్ దానయ్య నిర్మించారు..

 
Like us on Facebook