భరత్ అనే నేను టీజర్ విడుదల తేది ఖరారు !
Published on Feb 28, 2018 6:25 pm IST


మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న పొలిటికల్ డ్రామా భరత్ అనే నేను టీజర్ మర్చి 6న విడుదల చెయ్యబోతున్నారు. దివిజన్ అఫ్ భరత్ పేరుతో టీజర్ విడుదల చెయ్యబోతున్నారు. ఫస్ట్ వోట్ పేరుతో విడుదల చేసిన మహేష్ వాయిస్ మెసేజ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.

డీవివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ రెండోసారి మహేష్ ను డైరెక్ట్ చెయ్యడం, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా పెద్ద విజయం సాధించడంతో భరత్ అనే నేను సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగట్టు ఈ మూవీ ఉండబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

 
Like us on Facebook