‘భర్త మహాశయులకు’.. ఓటిటి, శాటిలైట్ డీటెయిల్స్ ఇవే!

Bhartha Mahasayulaku Wignyapthi

ఈసారి సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నేడు థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (Bhartha Mahasayulaku Wignyapthi) కూడా ఒకటి. మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి బజ్ ని సంతరించుకుంది. ఇక ఈ సినిమా తాలూకా పోస్ట్ థియేటర్స్ రిలీజ్ వేటిలో అందుబాటులో ఉంటుంది అనేది రివీల్ అయ్యింది.

ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులని ఒకే సంస్థ దక్కించుకున్నారు. మరి ఈ సినిమా ఓటిటి హక్కులు జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓటిటితో పాటుగా శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థనే సొంతం చేసుకోవడం విశేషం. సో జీ తెలుగు, జీ 5 లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ తర్వాత అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా ఆషిక రంగనాథ్, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version