టికెట్ రేట్ల పెంపుకు నో అంటున్న రవితేజ.. ఫ్యాన్స్ హ్యాపీ!

టికెట్ రేట్ల పెంపుకు నో అంటున్న రవితేజ.. ఫ్యాన్స్ హ్యాపీ!

Published on Dec 21, 2025 3:00 AM IST

BMW

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఫన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా అలరించనుందనే హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత సుధాకర్ చెరుకూరి కీలక ప్రకటన చేశారు. పండగ సీజన్ అయినప్పటికీ టికెట్ ధరలను పెంచబోమని, సాధారణ ధరలకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఇది ప్రేక్షకులకు మరింత చేరువయ్యే మంచి నిర్ణయంగా భావిస్తున్నారు.

ఈ సినిమాలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు