నైజాం లో “భీమ్లా నాయక్” బ్లాస్ట్..డే 1 వసూళ్ల వివరాలు.!

Published on Feb 26, 2022 9:51 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ మసాలా డ్రామా “భీమ్లా నాయక్”. మళయాళ చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేకర్స్ నిన్న రిలీజ్ చెయ్యగా ఓవరాల్ భారీ రెస్పాన్స్ తో ఈ సినిమా విడుదల అయ్యింది. మరి టాక్ తో సంబంధం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ ని అందుకుంటాయి.

మరి ఇప్పుడు భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్ లోనే నమోదు అవుతున్నాయి. ఇక ఆల్రెడీ అంతా అనుకుంటున్నట్టు గానే భీమ్లా నాయక్ నైజాం లో మొదటి రోజు రికార్డు వసూళ్లను అందుకొని మొదటి రోజే అక్కడ అలాగే 11.80 కోట్ల షేర్ ని అందుకొని ఆల్ టైం రికార్డు ను నమోదు చేసింది. మొత్తానికి అయితే అనుకున్న అంచనాలు నాయక్ రీచ్ అయ్యాడనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :