‘భీమ్లా నాయక్’ నుంచి భీభత్సమే అట.!

Published on Sep 1, 2021 10:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో ఇప్పుడు వ్యాప్తి చెందింది. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానుల హంగామాతో పాటుగా తన సినిమాల నుంచి కూడా అదిరే అప్డేట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో పవన్ నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” కూడా ఒకటి.

దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం నుంచి మేకర్స్ పవన్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేయనుండగా ఇది మాత్రం బీభత్సం గా ఉంటుందని సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి హింట్ ఇచ్చారు. అలాగే థమన్ కూడా ఈ సాంగ్ పై రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యంపై ఎగ్జైట్ అవుతున్నాడు.

మరి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ట్రాక్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :