“భీమ్లా” మాస్ సాంగ్ వింటూ డ్రైవింగ్ లో డానియల్ హీరోయిన్.!

Published on Feb 10, 2022 10:58 am IST


ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న పలు భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఇప్పుడు అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వెళ్తుంది.

అయితే ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ గా రానా డానియల్ శేఖర్ అనే మాస్ రోల్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి వీరి సరసన హీరోయిన్స్ గా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు నటిస్తున్నారు. అయితే డానియల్ భార్యగా కనిపిస్తున్న సంయుక్త అయితే ఇది వరకే తనకి ఈ సినిమా ఆల్బమ్ లో మాస్ నెంబర్ అయినటువంటి “లాలా భీమ్లా” సాంగ్ అంటే చాలా ఇష్టమని ముందు చెప్పడం జరిగింది.

అయితే ఆమె ఈ సాంగ్ కి ఎంతలా అడిక్ట్ అయ్యిందో లేటెస్ట్ గా వీడియో పెట్టి మరీ చూపించింది. తన కార్ డ్రైవింగ్ చేస్తూ భీమ్లా సాంగ్ నే వింటున్నానని ఓ పోస్ట్ పెట్టగా అది కాస్తా ఇపుడు వైరల్ అవుతుంది. మరి అందులో ఈ సాంగ్ ని ఆమె ఎంతలా ఎంజాయ్ చేస్తుందో కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా తన వీడియో ఆల్రెడీ లక్షకి పైగా వ్యూస్ దాటేసింది. మొత్తానికి మాత్రం థమన్ ఇచ్చిన సాంగ్ రెస్పాన్స్ మాత్రం ఇప్పటికీ రీసౌండ్ వస్తుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :