“భీమ్లా నాయక్” రిలీజ్ పై ఓ రేంజ్ లో కొనసాగుతున్న హైప్.!

Published on Feb 17, 2022 5:26 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ ఇప్పుడు అనుకోని విధంగా మొదటి డేట్ కే ఫిక్స్ అయ్యి ఒక్కసారిగా ఆసక్తి రేపింది.

అయితే ఈ అనౌన్సమెంట్ రావడంతోనే భీమ్లా నాయక్ రిలీజ్ కి సంబంధించి ఇది ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అన్ని చోట్ల కూడా ఒక్కసారిగా మారిన హైప్ క్లియర్ గా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ లో అయితే భారీ ఓపెనింగ్స్ ఈ చిత్రం అందుకోవడం ఖాయం అని సినీ వర్గాలు ఇప్పుడు నుంచే చెబుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై ఆల్రెడీ ఓవర్సీస్ లో స్ట్రాంగ్ బుకింగ్స్ ఈ చిత్రం కనబరుస్తుండగా రానున్న రోజుల్లో భీమ్లా నాయక్ మరింత బలపడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇపుడు భీమ్లా నాయక్ పై హైప్ మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. మరి రానున్న 25వ తేదికి భీమ్లా ఎలాంటి ఓపెనింగ్స్ రాబడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :