వైరల్ అవుతున్న “భీమ్లా నాయక్” మాస్ పోస్టర్!

Published on Sep 1, 2021 10:28 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తుండగా రేపు పవన్ బర్త్ డే కానుకగా పలు అప్డేట్స్ ఈ చిత్రం నుంచి సిద్ధంగా ఉన్నాయి.

అయితే పవన్ కి విషెష్ చెప్తూ మేకర్స్ రేపు అధికారికంగా రిలీజ్ చెయ్యాల్సిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముందే థియేటర్స్ కి పంపిన ఈ పోస్టర్ బయట నుంచి రాగా అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి హై తో వైరల్ అవుతుంది.

అదే లుంగీ, బ్లాక్ షర్ట్ తో కర్ర పట్టుకొని ఉన్న పవన్ పోస్టర్ బయటకి వచ్చింది. మరి ఇది రేపు అధికారికంగా రిలీజ్ కానుంది. అయితే ఇలాగే గతంలో మెగాస్టార్ ఆచార్య పోస్టర్ కూస వచ్చి వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి భీమ్లా చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :