“భీమ్లా” మాస్ పూనకాల ప్రోమోకి భారీ రెస్పాన్స్.!

Published on Nov 4, 2021 7:32 am IST

లాలా భీమ్లా అంటూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ సినిమా “భీమ్లా నాయక్” చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియెన్స్ లో కనుక ఓ సినిమా క్లిక్ అయితే దాని యుఫోరియా ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి హై లోనే పవన్ భీమ్లా నాయక్ కూడా ఉంది. అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ మాస్ సాంగ్ భీమ్లా మాస్ వెర్షన్ కు ప్రోమో నిన్న రిలీజ్ కాగా..

టాలీవుడ్ లో ఏ సినిమా అందులోని పాన్ ఇండియన్ సినిమాలు కూడా కలుపుకొని.. ఏ సినిమా ప్రోమోకి కూడా రాని సాలిడ్ రెస్పాన్స్ ని ఇది కొల్లగొట్టేసింది. రికార్డ్ నెంబర్ వ్యూస్ అలాగే ఆల్ టైం రికార్డ్ లైక్స్ తో ఈ ప్రోమో ఫుల్ సాంగ్ పై మరిన్ని అంచనాలు తెప్పించింది. ఆల్రెడీ మాస్ ఆడియెన్స్ లో పూనకాలు స్టార్ట్ చేసిన ఈ సాంగ్ ఇక వచ్చే 7 నుంచి ఏ రేంజ్ కి వెళుతుందో చూడాల్సిందే. మరి ఈ సినిమాకి థమన్ తన మాస్ విశ్వరూపం ఇచ్చేస్తున్నాడు. కంప్లీట్ ఆల్బమ్ కూడా ఎలా ఉంటుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :