హాఫ్ సెంచరీ కొట్టిన ‘భీష్మ’

Published on Feb 28, 2020 8:44 pm IST

ఫిబ్రవరి 21న విడుదలైన ‘భీష్మ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ వారం రోజుల్లో ఏ రోజూ హెవీ డ్రాప్స్ లేకుండా నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.19 కోట్లకు పైగా షేర్ అందుకుంది. అత్యధికంగా నైజాంలో రూ.7.5 కోట్ల షేర్ రాబట్టింది.

దీంతో బ్రేక్ ఈవెన్ కు అత్యంత చేరువైంది చిత్రం. ఈ సందర్బంగా టీమ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. వైజాగ్లోని గురజాడ కళా క్షేత్రంలో జరగనున్న ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ విజయంతో వరుసగా పరాజయాలు చవిచూసిన నితిన్ కెరీర్ గాడిలో పడ్డట్లైంది. డైరెక్టర్ వెంకీ కుడుముల సైతం ఈ విజయంతో హాట్ షాట్ అయ్యారు. ఇక రష్మిక మందన్నకు ఈ 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’తో కలిపి ఇది రెండో విజయం.

సంబంధిత సమాచారం :