‘భోగి’ క్లైమాక్స్ ముగించిన శర్వానంద్.. ఏకంగా అంతమందితోనా..?

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న ‘భోగి’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ తెలిపింది. కిరణ్ కుమార్ వేసిన భారీ సెట్‌లో, దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ కొరియోగ్రఫీలో 22 రోజుల పాటు ఏకధాటిగా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. 3 నెలల ప్లానింగ్‌తో 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించారు.

1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా ఆగస్టు 28న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Exit mobile version