టాప్ లో ట్రెండ్ అవుతోన్న “భోళా శంకర్”

Published on Aug 23, 2021 2:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పలు సినిమాల నుండి అప్డేట్స్ వరద వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాల్లో అందరినీ ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్న చిత్రం భోళా శంకర్. మెహెర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గారికి సోదరి గా కీర్తి సురేష్ నటించనుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను రాఖీ పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. టైటిల్ మరియు ఈ విడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో భోళా శంకర్ 8.1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం. అంతేకాక 300కే ప్లస్ లైక్స్ తో టాప్ లో యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :