ఓటిటి సమీక్ష: ‘దల్దల్’ – తెలుగు డబ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

ఓటిటి సమీక్ష: ‘దల్దల్’ – తెలుగు డబ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

Published on Jan 30, 2026 7:00 PM IST

DalDal

ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జనవరి 30, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: భూమి పెడ్నేకర్, సమారా తిజోరి, ఆదిత్య రావల్, అనంత్ మహదేవన్, గీతా అగర్వాల్, చిన్మయ్ మండలేకర్ తదితరులు
దర్శకత్వం: అమ్రిత్ రాజ్ గుప్తా
నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, సురేష్ త్రివేణి
సంగీతం: సుభజిత్ ముఖర్జీ
ఛాయాగ్రహణం: రాకేష్ హరిదాస్
కూర్పు: శివకుమార్ వి పానికేర్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ సహా ఓటిటిలో కూడా పలు కొత్త సినిమాలు ఇంకా సిరీస్ లు ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చాయి. మరి వీటిలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నే ‘దల్దల్'(Daldal). బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

Daldal Story కథ:

ముంబై లోని ఓ రెడ్ లైట్ ఏరియాలో కొందరు ఆడపిల్లలని అమ్మేసే ముఠా నుంచి వారిని కాపాడి ఏసీపీ రీటా ఫెరైరా (భూమి పెడ్నేకర్) డిపార్ట్మెంట్ లో డీజీపీ గా ప్రమోట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ జంతు ప్రేమికుడు మనోహర్ స్వామి (అనంత్ మహదేవన్) అత్యంత కిరాతకంగా చంపబడతారు. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోకి దిగిన రీటా ఏం చేసింది? ఆ క్రైమ్ కి పాల్పడింది ఎవరు? ఈ ఇన్వెస్టిగేషన్ లో రీటా తెలుసుకున్న షాకింగ్ నిజాలు ఏంటి? ఈ అంతటిలో జర్నలిస్ట్ అనిత ఆచార్య (సమారా తిజోరి) అలాగే డ్రగ్ అడిక్ట్ సాజిద్ (ఆదిత్య రావల్) ల పాత్రలు ఏంటి? చివరికి ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా? అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ గా వచ్చినప్పటికీ చివరి ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్స్ అంతా తక్కువ నిడివిలోనే సాగుతాయి. అయితే వీటిలో మొదటి మూడు ఎపిసోడ్స్ చూసే ఆడియెన్స్ కి ఒకింత డీసెంట్ థ్రిల్స్ ని అందిస్తాయని చెప్పవచ్చు. మొదటి ఎపిసోడ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథనం మ్యాటర్ లోకి వెళుతుంది.

అక్కడ నుంచి బిల్డ్ అయ్యే సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా డీసెంట్ గా అనిపిస్తుంది. అక్కడ నుంచి మెయిన్ కిల్లర్ ఎవరు అనే ట్విస్ట్ రివీల్ చేయడం వంటివి బాగున్నాయి. ఇక వీటితో పాటుగా ఇందులో నటీనటులు అంతా మంచి నాచురల్ పెర్ఫామెన్స్ లు అందించారు. భూమి పెడ్నేకర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మంచి నటన కనబరిచింది. తన పాత్రలోని షేడ్స్, అగ్రెసివ్ సీన్స్ లో ఆమె నటన బాగున్నాయి.

వీరితో పాటుగా గీతా అగర్వాల్ శర్మ, సౌరబ్ గోయల్ తదితరులు బాగానే చేశారు. కానీ సమారా తిజోరి మాత్రం ఈ సిరీస్ లో ది బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ భూమి అయినప్పటికీ సమారా తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. తన పాత్రకి తగ్గట్టుగా తనని తాను లుక్స్ పరంగా మార్చుకోవడమే కాకుండా తన పాత్ర లోని నెగిటివ్ షేడ్స్ ని చూపించడం సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి. తనతో పాటుగా తన ప్రేమికుడిగా కనిపించిన ఆదిత్య రావల్ కూడా మంచి పెర్ఫామెన్స్ ను అందించాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో మొదటి మూడు, నాలుగు ఎపిసోడ్స్ వరకు పర్వాలేదు కానీ అక్కడ నుంచి అంశాలు అన్నీ చాలా రొటీన్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. మెయిన్ కిల్లర్ ఎవరు అనేది రివీల్ చేయడం అప్పటికే ఇంకా చాలా కథనం బాకీ ఉన్నప్పటికీ దానిని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం అంత ఎంగేజింగ్ గా అనిపించదు.

ఇంకా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథనం ఇక్కడ అవసరం ఉంది. అంతే కాకుండా జరిగే సీరియల్ హత్యలలో అన్నిటికీ కనిపించే కారణాలు ఓకే కానీ జరిగిన మొదటి హత్యకే సరైన కారణం లేకుండా చూపించినట్టు అనిపిస్తుంది. అలాగే ఈ తరహా టెంప్లెట్ లో ఇది వరకే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ కూడా మనం చూసేసాం.

ఒక గ్యాంగ్ లేదా ఇద్దరు అన్న తమ్ములో, ప్రేమికులో ఇలా కలిసి సీరియల్ హత్యలు చేసే ప్లాట్ లో చాలానే వచ్చాయి. ఒక స్పైడర్, ఒక ఫ్యామిలీ డ్రామా, నా పేరు శివ ఇలా పలు రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తు రాకుండా ఉండవు. మెయిన్ గా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు లాంటివి ఎక్కువ చూసేవారికి అయితే ఈ సిరీస్ మరింత రొటీన్ అండ్ రెగ్యులర్ ఫీల్ నే మిగిలిస్తుంది.

ఇందులో దాదాపు ముఖ్య పాత్రలు అన్నిటికీ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది ఆ ట్రామాలు, స్లో కథనం ఒక స్టేజికి వచ్చేసరికి చూసే ఆడియెన్ కి విసుగు తెప్పించవచ్చు. సో ఇలా ఇందులో మెప్పించే అంశాల కంటే రొటీన్ అంశాలే ఎక్కువ కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. సిరీస్ టోన్ కి తగ్గట్టుగా అందించిన కెమెరా వర్క్, సంగీతం డీసెంట్ గా ఉన్నాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. ప్రోస్తటిక్ మేకప్ టీం వర్క్ బాగుంది. వీటితో పాటుగా తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది.

ఇక దర్శకుడు అమ్రిత్ రాజ్ గుప్త విషయానికి వస్తే.. తాను ఈ సిరీస్ ని ‘బెండీ బజార్’ అనే బుక్ ఆధారంగా డెవలప్ చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయి కానీ ఓవరాల్ గా ట్రీట్మెంట్ లో ఇంకా గ్రిప్పింగ్ గా సీన్స్ ని డిజైన్ చేసుకుంటే బాగుండేది. నటీనటులు నుంచి మంచి నటన అయితే రాబట్టగలిగారు కానీ కథనం వైపు కూడా ఇంకా ఎక్కువ దృష్టి సారించాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే.. ‘దల్దల్’ (Daldal Review) అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అనే చెప్పాలి. మొదటి మూడు ఎపిసోడ్స్ వరకు కథనం బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత నుంచి మాత్రం అంశాలు చాలా రొటీన్ గానే ఉన్నాయి. కానీ నటీనటుల పెర్ఫామెన్స్ లు ఇంప్రెస్ చేస్తాయి. సో మాకు రొటీన్ క్రైమ్ థ్రిల్లర్స్ అయినా పర్వాలేదు చూస్తాం అనుకునే వారికి తప్ప ఒక కొత్త రకం థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారికి ఇది అంత థ్రిల్స్ అందించదు. సో ఈ సిరీస్ కేవలం కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు