శంకర్ హిందీ ‘అపరిచితుడు’కి అప్పుడే గట్టి షాక్?

Published on Apr 15, 2021 2:00 pm IST

స్టార్ దర్శకుడు శంకర్ ఇప్పటి వరకు తీసిన పలు బెంచ్ మార్క్ చిత్రాల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ “అపరిచితుడు” సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో నిన్ననే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ కాంబోపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా స్టార్ట్ కానీ ఈ సినిమాకి ఆదిలోనే హంసపాదు అన్నట్టు అయ్యింది.

మరి అసలు విషయంలోకి వెళ్తే ఒరిజినల్ వెర్షన్ “అన్నియన్”(అపరిచితుడు) కథ నాకు సొంతమైనది అని కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవిచంద్రన్ చెప్పి ఓ ప్రెస్ నోట్ శంకర్ కు పంపడం షాక్ ఇచ్చింది. ఆ చిత్రాన్ని నిర్మాణం వహించిన ఆస్కార్ వి రవిచంద్రన్ ఆ సినిమా కథను రాసిన స్వర్గీయ సుజాత గారి నుంచి కథ తాలూకా హక్కులను కొనుగోలు చేసానని సో ఆ కథపై పూర్తి హక్కులు తనవి అని తెలిపారు.

దీనితో తన అనుమతి లేకుండా శంకర్ తన కథను హిందీలో తీస్తున్నారని విన్న వార్త తనకి ఆశ్చర్యం కలిగించింది అని ఇప్పటికీ కూడా బాలీవుడ్ లో ఇదే లైన్ తో కాపీ చేసి సినిమా తియ్యాలని చూస్తే లీగల్ సమస్యలు శంకర్ ఎదుర్కోక తప్పదని రవిచంద్రన్ హెచ్చరించారు. అయితే ఇది అధికారికమో కాదో కానీ ఆ ప్రెస్ నోట్ మాత్రం వైరల్ అవుతుంది. ఒకవేళ నిజం అయితే శంకర్ స్పందన ఏంటో చూడాలి.

సంబంధిత సమాచారం :