ఎఫ్ 2 లో బిగ్ బాస్ 2 సెలబ్రెటీ !

Published on Dec 27, 2018 2:09 pm IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2. ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఇక ‘బిగ్ బాస్ 2’ సీజన్ లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచియమైన కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈచిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమవుతున్నాడు.

ఈచిత్రంలో ఆయన కామిక్ రోల్ లో నటించారని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :