‘బిగ్ బాస్ 3’లో కొత్త కంటెస్టెంట్ !

‘బిగ్ బాస్ 3’లో కొత్త కంటెస్టెంట్ !

Published on Jun 11, 2019 3:59 AM IST

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఇక ఈ సారి బిగ్ బాస్ హోస్ట్ గా అక్కినేని నాగార్జున దాదాపుగా ఖాయం అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కూడా ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తీన్మార్ సావిత్రి. బిగ్ బాస్ షోలో ఈమె కూడా పార్టిసిపేట్ చేయబోతుందని సమాచారం. తీన్మార్ వార్తలతో సావిత్రి అలియాస్ జ్యోతి బాగా ఫేమస్ అయింది. అలాగే సీరియల్ యాక్టర్ జాకీ, కమల్ కామరాజు, గుత్తా జ్వాల, వరుణ్ సందేశ్ లాంటి సెలెబ్రిటీలు, బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు