ఈసారి బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పేది ఆ ఏడుగురిలో ఒకరు…!

Published on Aug 20, 2019 12:59 pm IST

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా గత నెలలో ప్రారంభమైన బిగ్ బాస్ షో రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికి నాలుగు వారాలు పూర్తిచేసుకున్న ఈ రియాలిటీ షో నుండి నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, చివరిగా రోహిణి ఎలిమినేట్ కాబడ్డారు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ కొరకు బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో ఏడుగురు సభ్యలు నామినేట్ కబడ్డారు.

ఇంటి కెప్టెన్ గా ఉన్నఅలీని తానునామినేట్ చేయాలనుకున్న నలుగురు ఇంటి సభ్యుల పేర్లు చెప్పమని బిగ్ బాస్ అడుగుతాడు. అలీ రాహుల్, వితిక, హిమజ, బాబా భాస్కర్ ను నామినేట్ చేశాడు. ఇక ఆ నలుగురిలో ఒకరిని మాత్రమే అలీ నామినేట్ చేయాల్సి ఉండగా, అలీ బాబా భాస్కర్ ని నామినేట్ చేయడం జరిగింది.

ఇక నామినేషన్ ప్రక్రియ కొరకు బిగ్ బాస్ నిర్వహించిన రెడ్ బాల్, బ్లాక్ బాల్ టాస్క్ ద్వారా నామినేషన్ కు ఆరుగురు ఎంపిక కాబడ్డారు. అలీ నామినేట్ చేసిన బాబా భాస్కర్ తో కలుపుకొని,రాహుల్ సిప్లిగంజ్, హిమజ, అషు రెడ్డి, మహేశ్ విట్టా,పునర్నవి, శివ జ్యోతి మొత్తం ఏడుగురు నామినేట్ కావడం జరిగింది. మరి ఈ ఏడుగురిలో ఎవరు హౌస్ నుండి వెళ్లిపోనున్నారు అనేది తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More