బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా..!

బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా..!

Published on May 19, 2020 8:58 PM IST

తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొట్టమొదటిసారి తెలుగు ప్రేక్షకులకు ఈ క్రేజీ రియాలిటీ షో పరిచయం అయ్యింది. ఇక మొదటిసారి బుల్లి తెరపై ఓ రియాలిటీ షో హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ తన మెస్మరైజింగ్ స్కిల్స్ మరియు వాగ్దాటితో అదరగొట్టాడు. ఇక పదహారు మంది సభ్యులతో సాగిన ఈ షో విన్నర్ గా శివ బాలాజీ నిలువగా, ఆదర్శ్ బాలకృష్ణ రన్నర్ గా నిలిచాడు.

కాగా బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న సభ్యులు రేపు ఎన్టీఆర్ కొరకు ప్రత్యేక బర్త్ డే విషెస్ వీడియో సిద్ధం చేశారు. ఈ వీడియోని మ్యూజిక్ సెన్సేషన్ తమన్ విడుదల చేస్తున్నారు. రేపు ఉదయం 9:30 నిమిషాలకు ఈ వీడియో విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్ వీడియో వాయిదాపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు