‘జై హనుమాన్’ కి బిగ్ ఛేంజ్.. ఆస్కార్ విజేతతో మరింత భారీగా ప్లానింగ్

jai-hanuman

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ సూపర్ హిట్ చిత్రం హను మాన్ తో తనకి అలాగే తన హీరో తేజ సజ్జకి పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు వచ్చింది. మరి హను మాన్ కి సీక్వెల్ జై హనుమాన్ ని ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నేడు ఆ కార్యక్రమం జరిగింది.

ఇక ఈ సినిమాకి మాత్రం చాలా విషయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్మాణ సంస్థే మారగా కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ గా కనిపించడం అనేది మరింత పెద్ద అంశంగా మారింది. ఇక ఈ సినిమా సంగత దర్శకుడు విషయంలో కూడా బిగ్ ఛేంజ్ ఇపుడు చోటు చేసుకుంది.

గత సినిమాకి యువ సంగీత దర్శకుడు గౌర హరి ప్రశాంత్ వర్మకి రాజమౌళి చిత్రాలకి ఎం ఎం కీరవాణి ఎలాంటి సంగీతం అందిస్తారో అదే రీతి వర్క్ ని అందించారని హను మాన్ సమీక్షలో తెలిపాము. ఇప్పుడు అదే నిజం చేశారు. పార్ట్ 2 కోసం ఏకంగా ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణినే తీసుకున్నారు. రిషబ్ తన లేటెస్ట్ పోస్ట్ లో కీరవాణిని కూడా మెన్షన్ చేయడంతో ఇది కన్ఫర్మ్ అయ్యింది. సో జై హనుమాన్ మరింత భారీ ప్లానింగ్ తో మరింత పెద్దదిగా రాబోతుంది అని చెప్పాలి.

Exit mobile version