బిగ్ న్యూస్: మెగాస్టార్ అవైటెడ్ ఫాంటసీ వండర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్!

బిగ్ న్యూస్: మెగాస్టార్ అవైటెడ్ ఫాంటసీ వండర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jul 2, 2026 3:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” తో టాలీవుడ్ లో రీజనల్ గా భారీ హిట్ ని తాను సెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని కంటే ముందే రావాల్సిన అవైటెడ్ ఫాంటసీ వండర్ సినిమా “విశ్వంభర” రిలీజ్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల తేదీ ఎట్టకేలకి ఇపుడు లాక్ అయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ మెగా ఫాంటసీ వండర్ ని అనుకున్నట్టే దసరా బరిలో నిలుపుతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అక్టోబర్ 16న దసరా కానుకగా థియేటర్స్ లో విడుదల చేయడం ఇప్పుడు ఖరారు అయ్యింది. ఇక దీనిపై అధికారిక అనౌన్స్మెంట్ ఒక్కటి మేకర్స్ నుంచి రానుంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు