బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్‌కి అదిరిపోయే ఆఫర్?

Published on Aug 4, 2021 2:00 am IST

బిగ్‌బాస్ సీజన్-4తో తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైన గుజరాతీ భామ మోనాల్ గజ్జర్‌కు తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున హీరోగా, క‌ల్యాన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న “బంగార్రాజు” చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు మోనాల్‌ను చిత్ర యూనిట్ సంప్రదించగా అందుకు ఆమె ఒకే చెప్పినట్టు సమాచారం. అయితే సోగ్గాడే చిన్ని నాయ‌న చిత్రంలో యాంకర్ అన‌సూయ స్పెష‌ల్ సాంగ్‌లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. మరీ బంగార్రాజులో ఛాన్స్ ఒకే అయితే మోనాల్ ఎలా మెప్పిస్తుందో చూడాలి మరీ.

ఇదిలా ఉంటే గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన “అల్లుడు అదుర్స్” సినిమాలో కూడా మోనాల్ స్పెష‌ల్ సంగ్‌లో స్టెప్పులేసింది. ఇక ప్రస్తుతం మోనాల్ బిగ్‌బాస్ హౌస్‌మేట్ అఖిల్‌తో ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఇదే కాకుండా స్టార్ మాలో వచ్చే డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జీగా వ్యవహరిస్తుంది.

సంబంధిత సమాచారం :