నవీన్ పోలిశెట్టి.. వరుసగా పెద్ద నిర్మాతలు

Published on Mar 12, 2021 3:17 am IST

ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న యువ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హిట్ తర్వాత ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. ఆయన నటనకు ప్రేక్షకులు ఆకర్షితులు కావడంతో చిన్న నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న సినిమాలు చేయాలనుకునే పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఆయన్ను అప్రోచ్ అవుతున్నాయి. ఇక ఆయన కొత్త చిత్రం ‘జాతిరత్నాలు’ ఈరోజే విడుదలైంది. సినిమా టాక్ ఎలా ఉన్నా నవీన్ నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడిపోయాయి.

ఆయనలోని కామెడీ టైమింగ్ అదుర్స్ అంటున్నారు ఆడియన్స్. నవీన్ కామెడీ టైమింగే సినిమాను నిలబెట్టిందని కితాబిస్తున్నారు. కమర్షియల్ గా సినిమా నెగ్గుకొచ్చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో నవీన్ పోలిశెట్టికి స్థిరమైన మార్కెట్ ఒకటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విజయంతో ఆయనకు పెద్ద నిర్మాతల నుండి ఆఫర్లు వెళుతున్నాయట. ఇప్పటికే మూవీ క్రియేషన్స్ నందు నవీన్ పోలిశెట్టి ఒక సినిమాకు సైన్ చేశారు. తాజాగా ఇంకొక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడ ఆయనతో సినిమా చేయడానికి అయిందని, నవీన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :