ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడ్డాడు. ఐతే, ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే ఎన్టీఆర్ పాత్ర పేరు అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమా టైటిల్ ను ఒకేసారి రివీల్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందట.
ఎలాగూ జనవరి ఎండింగ్ కల్లా మెయిన్ షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుందని.. కాబట్టి, ఈ లోపు వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


