ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో సెన్సేషనల్ కాంబినేషన్ ప్రభాస్ అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ కూడా ఒకటి. వీరి కలయికలో అనౌన్స్ చేసిన “స్పిరిట్” పై ఉన్న అంచనాలే వేరు.. అయితే గత కొన్ని రోజులు నుంచి హీరోయిన్ రూమర్స్ గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా మేకర్స్ ఈ బిగ్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ తో క్రేజీ అనౌన్సమెంట్ తో హీరోయిన్ ని ప్రకటించేసారు.
దీపికా పదుకోణ్ కాకుండా ఈ చిత్రం నుంచి ఇపుడు ఇదే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం ‘అనిమల్’ తో ఫేట్ మార్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హీరోయిన్ గా చేస్తున్నట్టు పాన్ ఆసియన్ పోస్టర్ తో మాస్ అప్డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ బిగ్ క్లారిటీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అలాగే ఈ అవకాశంపై త్రిప్తి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది.
View this post on Instagram