ఇళయ దళపతి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయినటువంటి విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రమే ‘జన నాయగన్’. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమా కాగా విజయ్ ముందే ఈ సినిమాతో ఇక ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటానని హామీ ఇచ్చి సీఎం అయ్యిపోయాడు.
అయితే ఇప్పుడు దళపతి విజయ్ నటించిన ఈ ఆఖరి సినిమా ఎన్నో అడ్డంకులు తర్వాత ఎట్టకేలకి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇన్ని రోజులు ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది చూసిన ఈ సినిమా ఇక ఆగేది లేదని కే వి ఎన్ ప్రొడక్షన్స్ అధినేత క్లారిటీ ఇచ్చారు. నేడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఆఖరి సినిమా విడుదల మరో రెండే వారాల్లో అని కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ సినిమా ఈ మే 28 రిలీజ్ కి లాక్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఇది మాత్రం విజయ్ అభిమానులు బిగ్ పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి.


