బిగ్‌బాస్ 4: గంగవ్వ ప్లేస్ లో ఎవరు వస్తారో ?

బిగ్‌బాస్ 4: గంగవ్వ ప్లేస్ లో ఎవరు వస్తారో ?

Published on Oct 11, 2020 12:04 PM IST

బిగ్‌బాస్ 4 సీజన్‌ లో అత్యంత ప్రజాధరణ పొందుతున్న సెలెబ్రిటీ ఎవరన్నా ఉన్నారు అంటే.. ఆమె గంగవ్వనే. మొత్తానికి గంగవ్వను షోలో తీసుకోవడం గంగవ్వకు కంటే కూడా, షోకే ఎక్కువ ప్లస్ అయింది. తెలంగాణ యాసలో గంగవ్వ చెప్పే డైలాగ్ లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆమెలోని మట్టి వాసనకు, తెలంగాణ యాసకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే గంగవ్వ ఆరోగ్యం బాగాలేకపోవడంతో షో నుండి విచారంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

నాగార్జున ప్రత్యేక అనుమతి తీసుకొని గంగవ్వను తిరిగి ఆమె గ్రామానికి పంపించారు. మరి ఈ రోజు ఎలిమినేషన్ ఉంటుందా అనేది డౌట్. అలా కాకుండా, ఎలిమినేట్ అయిన కంటెంస్ట్ లలో ఒకరిని గంగవ్వ స్థానంలో తిరిగి ఇంట్లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్వాతి దీక్షిత్, సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మరి వీరిలో ఇప్పుడు ఎవరు తిరిగి షోలోకి వస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు