ఆమె ప్రజాదరణ బిగ్ బాస్ కి షాకే !

Published on Nov 30, 2020 10:15 am IST

బిగ్ బాస్ సీజన్ 4 రేస్ టు ఫినాలే బెల్స్ మోగడంతో షో మరింత ఆసక్తిగా మారింది. దీంతో ఫైనల్‌కి చేరే కంటెస్టెంట్స్ ఎవరన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అందుకే ఈవారం ఎలిమినేషన్ మరింత కీలకం కానుంది. ఆయితే ఈవారం నామినేషన్స్‌లో మోనాల్, అఖిల్, అరియానా, అవినాష్‌లు ఉన్నారు. మరి వీరిలో ఒకరు ఎలిమినేట్ కావడం పక్కా. కాకపోతే అవినాష్‌కి అవిక్షన్ ఫ్రీ పాస్ లభించడంతో దాన్ని ఉపయోగించుకుని అతను నామినేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఉండటంతో అతను నామినేషన్ నుండి తప్పించుకోవచ్చు.

దాంతో మిగిలిన కంటెస్టెంట్స్‌లో అరియానా, అఖిల్, మోనాల్‌ ముగ్గురి మధ్యే పోటీ ప్రధానంగా ఉండనుంది. బిగ్ బాస్ 4 – అరియానాకి దక్కుతున్న ప్రజాదరణతో మేకర్స్ కూడా షాక్ అయ్యారు. ఓటింగ్స్ లో అరియానా చాలా ప్రజాదరణ పొందింది. షోలో అరియానాకు ఓట్లు వస్తున్న తీరు చూస్తుంటే.. మిగిలిన వారికి ఆ స్థాయిలో రావడం లేదట. మొత్తానికి ఈ యువ యాంకర్ తన సాహసోపేత వైఖరి మరియు బాడీ లాంగ్వేజ్ తో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :

More