బిగ్‌బాస్ నిర్వాహకులకు షాక్.. కంటెస్టెంట్లలో కొందరికి కరోనా.!

Published on Aug 28, 2021 1:30 am IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేది నుంచి ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్‌ 5వ తేదిన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ షో, సోమ-శుక్ర వారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. అయితే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లను కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కి పంపించారు.

ఈ క్రమంలో నిర్వాహకులకు షాక్ తగిలింది. తాజాగా కంటెస్టెంట్లందరికి కరోనా పరీక్షలు చేయగా అందులో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని టాక్ వినిపిస్తుంది.. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే బయటకు రాలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఉన్న ఫలంగా కంటెస్టెంట్లను మారుస్తారా? లేక షోను వాయిదా వేస్తారా? అనేది ఆసక్తిగా మారే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :