ఈ ఆదివారం నుండి మొదలు కానున్న “బిగ్ బాస్ 5”

Published on Sep 1, 2021 11:40 am IST


నాగార్జున వ్యాఖ్యాత గా బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మొదలు కానుంది. స్టార్ మా నిర్వహిస్తున్న ఈ బిగ్ బాస్ ఐదవ సీజన్ ఈ ఆదివారం నుండి ప్రసారం కానుంది. సెప్టెంబర్ 5 వ తేదీ సాయంత్రం 6 గంటలకు మొదలు కానున్నట్లు తాజాగా స్టార్ మా వెల్లడించడం జరిగింది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మిగతా శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

గత సీజన్ ల లాగా కాకుండా, ఈ సారి సరికొత్త టాస్క్ లతో కార్యక్రమం మరింత ఆసక్తి కరంగా ఉంటుంది అని తెలుస్తోంది. టాస్క్ లు ఈసారి శారీరకంగా, మానసికంగా సవాల్ విసిరే విధంగా ఉంటాయని తెలుస్తోంది. మరొకసారి నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న నేపథ్యం లో బుల్లితెర ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :