పానీపూరి కోసం బిగ్ బాస్ డేరింగ్ బ్యూటీ ఏకంగా.. !

Published on May 18, 2020 12:07 pm IST

కరోనా లాక్ డౌన్ తో రెండు నెలలుగా అందరూ ఇంటికే పరిమితం అవ్వడంతో స్ట్రీట్ ఫుడ్ బాగా మిస్ అయిపొయింది. ముఖ్యంగా, పానీపూరి అంటే దేశవ్యాప్తంగా యువతకి బాగా ఇష్టం. సెలబ్రిటీలు కూడా దీనికి మినహాయింపు ఏమి కాదు. తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి అనేది పోయి.. పానీ పూరినే నేటి జనరేషన్ క్రేజీ ఫుడ్ అయిపొయింది.

కాగా బిగ్ బాస్ హౌస్‌ తో డేరింగ్ అండ్ డాషింగ్ లేడీగా పేరొందిన యాంకర్ అండ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిమజా, తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పానీ పూరి కోసం తను ఎంతగా పరితపిస్తోందో చెప్పడానికి సరదాగా ఒక వీడియోను తీసి షేర్ చేసింది.

వీడియోలో, హిమజా తన స్మార్ట్ టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అభ్యర్థిస్తునట్లు ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :