బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం సరయు ఎలిమినేట్ కాబోతుందా?

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం సరయు ఎలిమినేట్ కాబోతుందా?

Published on Mar 27, 2022 12:26 AM IST

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే నాలుగో వారాన్ని పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో లో మొదటి వారం వారియర్స్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఛాలెంజర్స్ నుంచి శ్రీరాపాక, మూడో వారం వారియర్స్ నుంచి ఆర్జే చైతూ ఎలిమినేట్‌ అయ్యారు. ఇక హౌస్‌లో మిగిలిన 14 మందిలో నాలుగో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈ వారం సరయు హౌస్‌ను వీడనుందని ప్రచారం జరుగుతుంది.

అయితే నిజానికి నాలుగోవారం ఛాలెంజర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్‌ అవుతారని, పెద్దగా పాపులారిటీ లేని అనిల్‌, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు బయటకు వచ్చేయడం తథ్యమని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ వారం ఛాలెంజర్స్ నుంచి కాకుండా వారియర్స్ నుంచి సరయు ఎలిమినేట్ కాబోతుందట. రెగ్యులర్ బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొని తొలి వారమే ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చిన సరయు.. ఓటీటీ బిగ్‌బాస్‌లో ఎలాగైన టాప్ 5లోకి చేరుకోవాలని అనుకుంది. కానీ ఇక్కడ కూడా ఆమె నాలుగు వారాలకే బయటకొచ్చేస్తుందని ప్రచారం జరుగుతుంది. మరీ నిజంగా సరయు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందా? లేదా? అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు