బిగ్‌బాస్-5 హోస్ట్‌గా భళ్లాల దేవ.. నిజమేనా?

Published on Jun 30, 2021 2:08 am IST


తెలుగు రియాలిటీ షోలలో అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులారిటీ, అనూహ్యమైన రేటింగ్‌ను సంపాదించుకోవడంతో ఒక్కసారిగా మంచి క్రేజ్ పెంచుకున్న ప్రోగ్రాం బిగ్‌బాస్. బిగ్‌బాస్ సీజన్-1కు జూనియర్ ఎన్‌టీఆర్ హోస్టుగా చేసి తన యాక్టింగ్, యాంకరింగ్‌తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. కాగా బిగ్‌బాస్ సీజన్-2కు నాని హోస్ట్‌గా చేసి పర్వాలేదనిపించాడు. ఇక బిగ్‌బాస్ సీజన్-3,4 లకు నాగార్జున హోస్ట్‌గా చేసి అందరిని మెప్పించాడు.

అయితే బిగ్‌బాస్ మొదటి సీజన్‌కి వచ్చినంత రేటింగ్, క్రేజ్ వంటివి ఆ తర్వాత సీజన్లకు రాలేదన్న టాక్ మాత్రం ఓ వైపు నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఏది ఏమైనప్పటికి బిగ్‌బాస్ సీజన్-5ని స్టార్ట్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయిపోయారు. కరోనా కారణంగా మొన్నటి వరకు వాయిదా పడ్ద ఈ సీజన్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీజన్‌కు హోస్ట్ మారబోతున్నట్టు కొత్తగా టాక్ నడుస్తుంది. బిజీ షెడ్యూల్ కారణంగా నాగ్ ఈ సారి అందుబాటులో ఉండకపోవచ్చని, దీంతో ఈ షోకు వ్యాఖ్యాతగా భళ్లాల దేవ రానా దగ్గుబాటిని ఒప్పించేందుకు నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :