బిగ్‌బాస్ సీజన్-5కి ఈసారి కూడా ఆయనేనట?

Published on Jul 2, 2021 3:30 am IST


తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఐదో సీజన్ ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. కాగా వీలైనంత త్వరగా సీజన్ 5ని ప్రారంభించి అభిమానులకు ఎంటర్‌టైన్‌ను అందించాలని నిర్వాహకులు భావిస్తున్నప్పటికి ఇప్పుడప్పుడే అది సాధ్యపడేలా లేదనిపిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గడంతో జూలైలో ఈ సీజన్‌ను ప్రారంభించాలని ముందుగా అనుకున్నారు. కానీ కంటెస్టెంట్ల ఎంపిక, సెట్టింగ్ చేయడం ఆలస్యం అవుతుందని దీంతో ఆగష్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ఈ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీజన్‌కు హోస్ట్‌గా భళ్లాల దేవ రానా రాబోతున్నారని ఓ పక్క తెగ ప్రచారం జరుగుతున్నా.. మరోసారి అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :