బిగ్‌బాస్-5 ప్రారంభ తేదిపై క్లారిటీ వచ్చేసిందోచ్..!

Published on Aug 27, 2021 10:00 pm IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు అన్ని భాషల్లో ఉన్న క్రేజ్ గురుంచి పెద్దగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను కూడగట్టుకుంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఐదో సీజన్ ప్రారంభ తేదిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

అయితే బిగ్‌బాస్ సీజన్ 5ను సెప్టెంబర్‌ 5వ తేది నుంచి ప్రారంభించబోతున్నట్టు స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 5వ తేదిన సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ షో, సోమ-శుక్ర వారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక కంటెస్టెంట్లుగా ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తుండగా, ఎవరెవరు హౌస్‌లోకి వెళతారన్నది మాత్రం సెప్టెంబర్ 5వ తేదిన తేలిపోనుంది.

సంబంధిత సమాచారం :