“బిగ్ బాస్” సోహైల్ ఎమోషనల్ వీడియో వైరల్.!

“బిగ్ బాస్” సోహైల్ ఎమోషనల్ వీడియో వైరల్.!

Published on Feb 3, 2024 12:00 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర హిట్ అయిన అతి ఏడిద రియాలిటీ షో బిగ్ బాస్ తో ఆడియెన్స్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ చాలా మందే ఉన్నారు. అలా బిగ్ బాస్ తర్వాత మంచి బ్రేక్ అందుకొని తెలుగు సినిమా దగ్గర బిజీగా ఉన్న కొందరిలో యంగ్ నటుడు సోహైల్ కూడా ఒకడు. అయితే తాను బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ కూడా కాకపోయినప్పటికీ అప్పుడు తనకి మంచి క్రేజ్ వచ్చింది. దీనితో ఆ తర్వాత నుంచి పలు చిత్రాలు చేయడం స్టార్ట్ చేసాడు.

అలా లేటెస్ట్ గా తన నుంచి చిత్రమే “బూట్ కట్ బాలరాజు”. మరి ఈ సినిమా విషయంలో ఆడియెన్స్ ని వచ్చిన రెస్పాన్స్ తో బాగా అప్సెట్ అయ్యాడు. దీనితో ఓ ఎమోషనల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన సినిమా ఫ్యామిలీ అంత కలిసి చూసే సినిమా అని అయినా నా సినిమా చూడ్డానికి ఎందుకు రావట్లేదు అని వాపోయాడు. అప్పుడు బిగ్ బాస్ సమయంలో సపోర్ట్ చేసిన వారు అంతా ఏమైపోయారు అంటూ ప్రశ్నించాడు. దీనితో తన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు