బిగ్‌బాస్ నాన్ స్టాఫ్: హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల జాబితా ఇదే..!

బిగ్‌బాస్ నాన్ స్టాఫ్: హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల జాబితా ఇదే..!

Published on Feb 26, 2022 11:03 PM IST

బుల్లితెరపై అలరించిన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించబోతుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ స్ట్రీమింగ్ నేడు ప్రారంభమయ్యింది. ఈ షోకి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 17 మంది కంటెస్టెంట్లు, 84 రోజులు పాటు హౌస్‌లో ఉంటారని, అయితే గత సీజన్లలో పాల్గొన్న వారిని వారియర్స్‌గా, కొత్తగా వచ్చే వారిని చాలెంజర్లుగా పేర్కొంటున్నట్టు నాగార్జున తెలిపాడు. మరీ హౌస్‌లోకి ఎంత మంది వారియర్స్ వెళ్ళారు, ఎంత మంది ఛాలెంజర్స్ వెళ్ళారనేది తెలుసుకుందాం రండి.

హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్ల జాబితా:

1) అషూ రెడ్డి (బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ కంటెస్టెంట్)
2) మహేశ్ విట్టా (బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ కంటెస్టెంట్)
3) ముమైత్‌ఖాన్ (బిగ్‌బాస్ తొలి సీజన్ కంటెస్టెంట్)
4) అజయ్‌ కాతువాయూర్‌ (కొత్త కంటెస్టెంట్)
5) స్రవంతి చొక్కారపు (కొత్త కంటెస్టెంట్)
6) ఆర్జే చైతూ (కొత్త కంటెస్టెంట్)
7) అరియానా గ్లోరీ (బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్)
8) నటరాజ్‌ మాస్టర్‌ (బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్)
9) శ్రీరాపాక (కొత్త కంటెస్టెంట్)
10) మోడల్ అనిల్ (కొత్త కంటెస్టెంట్)
11) మిత్ర శర్మ (కొత్త కంటెస్టెంట్)
12) తేజస్వి మదివాడ (బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ కంటెస్టెంట్)
13) సరయు రాయ్‌ (బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్)
14) యాంకర్‌ శివ (కొత్త కంటెస్టెంట్)
15) బిందుమాధవి (కొత్త కంటెస్టెంట్)
16) హమీదా (బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్)
17) అఖిల్ సార్థ‌క్‌ (బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రన్నరప్‌)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు