బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?

బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?

Published on Jun 21, 2022 2:26 AM IST

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తిచేసుకుంది. అలానే ఈ ఏడాది బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా కూడా ప్రేకషకులను ఎంటర్‌టైన్ చేయాలనుకున్నారు. హాట్‌స్టార్‌లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ ప్రేక్షకులను మెప్పించలేదు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్ సీజన్ 6ని మరికొన్ని రోజుల్లో మొదలుపెట్టనున్నారు.

అయితే జూలై లేదా ఆగస్టు నెలలో ఈ షో మొదలుకానుండగా దానికోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు. యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. దాదాపు వీరిని ఫైనల్ చేసినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు