1000 మందితో హార్స్ మేళ సీక్వెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్

1000 మందితో హార్స్ మేళ సీక్వెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్

Published on Feb 23, 2016 10:29 AM IST

Sardaar-Gabba-Singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పవర్ ప్యాక్ ఎంటర్టైనర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా ఉండేలా తెరకెక్కిస్తున్న విషయం మీకు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ప్రసతుతం సర్దార్ టీం హార్డ్ మేళ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తోంది. ఈ సీక్వెన్స్ ని కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ వ్యయం ఖర్చు పెట్టి తీస్తున్నారు.

ఈ హార్స్ మేళ సీక్వెన్స్ కోసం 100 గుర్రాలను షూటింగ్ స్పాట్ లో పెట్టారు.. వటిని కంట్రోల్ చేస్యడం కోసం హార్స్ మెన్స్ ఉన్నారు. వీరు కాకుండా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నికల్ టీంతో కలుపుకొని మొత్తంగా 1000 మంది సెట్ లో ఉన్నారు. అంతే కాకుండా 10 వింటేజ్ కార్స్, అలాగే పలు న్యూ మోడల్ కార్స్ ని కూడా ఈ సీక్వెన్స్ ని తీయడంలో ఉపయోగిస్తున్నారు. ఈ సినిమాకి ఈ హార్స్ మేళ సీక్వెన్స్ మేజర్ హైలైట్ అవుతుందని సమాచారం.

ఈ చిత్ర టీం అనౌన్స్ చేసిన దాని ప్రకారం మార్చి మిడిల్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి, ఏప్రిల్ 08న పక్కాగా సినిమాని రిలీజ్ చేసేలా ఫిక్స్ చేసారు. ఆన్ టైం సినిమాని రిలీజ్ చేయడం కోసం ప్రస్తుతం 3 యూనిట్స్ నిర్విరామంగా పనిచేస్తున్నాయి.

తాజా వార్తలు