ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతున్న బిగిల్

ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతున్న బిగిల్

Published on Oct 22, 2019 10:47 PM IST

విజయ్-అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం బిగిల్ పై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తేరి, మెర్సల్ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రంపై అంతకు మించిన అంచనాలు నెలకొన్నాయి. విజయ్ మూడు డిఫరెంట్ లుక్స్ కనిపించడంతో పాటు, ట్రైలర్స్, టీజర్స్ వలన అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడులవుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 నుండి 4200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారని సమాచారం.

తమిళ మరియు తెలుగు భాషలలో ఒకే రోజు విడుదల అవుతున్న ఈచిత్రంపై ఉన్న హైప్ దృష్ట్యా ఈ స్థాయిలో విడుదల చేస్తున్నారని సమాచారం. ఐతే ఈమూవీ ప్రీమియర్స్ ప్రదర్శనకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ఒకింత ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. విజయ్ కి జంటగా నయనతార నటించిన ఈ మూవీకి సంగీతం లెజెండరీ మ్యూజీషియన్ ఏ ఆర్ రెహమాన్ అందించారు. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు