సుశాంత్ మరణం…నిద్రలేచిన బీహారీవాదం..!

సుశాంత్ మరణం…నిద్రలేచిన బీహారీవాదం..!

Published on Jun 24, 2020 9:21 AM IST

Sushant Singh Rajput 1

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యకు బాలీవుడ్ పెద్దలు కారణం అని అందరూ ఆరోపిస్తున్నారు. అతనికి పరిశ్రమలో గాడ్ ఫాధర్స్ లేకపోవడం వలన..కనీస గౌరవం ఇవ్వలేదని, అతన్ని అన్ని విధాలుగా తొక్కేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు నెలలో బాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలు సుశాంత్ ని బ్యాన్ చేయడంతో సైన్ చేసిన ఆరు సినిమాలు రద్దు అయ్యాయని తెలుస్తుంది. సుశాంత్ బీహారీ కావడం వలనే అతన్ని ఇంతగా వేధించారన్న వాదం తెరపైకి వచ్చింది.

దీనితో సుశాంత్ సింగ్ మరణానికి కారణమైన వారి సినిమాలు బ్యాన్ చేయాలని బీహారీలు నిర్ణయించుకున్నారు. సుశాంత్ మానసిక క్షోభకు కారణమైన వారిగా తెరపైకి వచ్చిన సల్మాన్ ఖాన్, అలియా భట్, సల్మాన్ వంటి వారి చిత్రాలు బీహార్ లో బ్యాన్ చేయాలి అంటున్నారు. ఇకపై ఇకపై వారు నిర్మించిన లేదా నటించిన సినిమాలు విడుదల కానివ్వం అని వారు గట్టిపట్టుదలతో ఉన్నారు. మరి ఇదే కనుక జరిగితే బాలీవుడ్ ఓ మంచి మార్కెట్ ని కోల్పోయినట్లే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు