‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ పై దిల్ రాజు క్లారిటీ !

Published on Aug 8, 2022 1:02 pm IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చిన ‘బింబిసార’ గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. బింబిసార సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ’50 రోజుల తర్వాత మాత్రమే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని దిల్ రాజు స్పష్టం చేశారు.

ఇక బింబిసార సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌ఏలోనూ భారీ వసూళ్లు వస్తున్నాయి. కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటించారు. మొత్తానికి ‘బింబిసార’ హిట్ కావడంతో.. ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది.

సంబంధిత సమాచారం :