ఈ ఏడాదిలో తెలుగు సినిమా దగ్గర వచ్చిన పలు సూపర్ అండ్ సర్ప్రైజింగ్ హిట్ చిత్రాల్లో ఇటీవల వచ్చిన ఓ యదార్ధ ప్రేమ కథా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి కూడా ఒకటి. ఆ సినిమా నటీనటులు గని దర్శకుడు కోసం గాని ఆడియెన్స్ కి పెద్దగా పరిచయమే లేదు. అలాంటిది సీన్ కట్ చేస్తే ఈ సినిమా భారీ హిట్ అయ్యి మంచి లాభాలు కూడా అందించింది. ఇక ఈ సినిమా థియేటర్స్ తర్వాత రీసెంట్ గానే ఓటిటిలో కూడా విడుదలకి వచ్చింది.
ఈ సినిమాని ఈటీవీ విన్ సొంతం చేసుకోగా అందులో కొన్ని రోజులు కిందటే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడ కూడా సంచలన రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకోవడం విశేషం. ఈ సినిమా ఈటీవీ విన్ లో ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలిపారు. దీనితో అక్కడ కూడా ఈ సినిమాకి ఆధారం ఏ స్థాయిలో సొంతం అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.


