మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బ్లూ స్కై.!

మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బ్లూ స్కై.!

Published on Aug 12, 2014 1:02 PM IST

Olk
ఓవర్సీస్ లో పలు సక్సెస్ఫుల్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ బ్లూ స్కై. ప్రస్తుతం బ్లూ స్కై వారు తెలుగులో రానున్న క్రేజీ ప్రాజెక్ట్స్ రైట్స్ ని వరుసగా సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమా రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు.

బ్లూ స్కై వారు తాజాగా మరో క్రీజీ ప్రాజెక్ట్ ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అక్కినేని నాగ చైతన్య, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. ఈ సినిమా రైట్స్ ని బ్లూ స్కై వారు ఒక ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ‘ఒక లైలా కోసం’ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు. అలాగే ఆగష్టు 15న ఈ మూవీ ఆడియోని రిలీజ్ చేసి, సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు