రవితేజ సినిమాలో తమిళ నటుడు !

రవితేజ సినిమాలో తమిళ నటుడు !

Published on Nov 4, 2018 12:07 PM IST

bobby simha

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు. ఇప్పటికే ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ అలాగే ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ లను కథానాయికలుగా ఎంపికైయ్యారు. మరో హీరోయిన్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇక చిత్ర వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో తమిళ నటుడు బాబీ సింహ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడట. ఆయతో పాటు ప్రముఖ నటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన వెలుబడనుంది. రవితేజ డ్యూయెల్ రోల్లో నటించనున్న ఈ చిత్రానికి ‘డిస్కో’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈచిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు