వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ అమ్మాయి

Published on Feb 21, 2020 2:01 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ విదేశాల్లో బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. కొత్త మెకోవర్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా అన్ని విధాల కొత్తగా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు హీరోయిన్ పాత్రలో కనబడబోయే అమ్మాయి కూడా కొత్త ఫేస్ అయితే బాగుంటుందని అనుకున్నారు.

అందుకే బాలీవుడ్ జల్లెడపట్టి సాయి మంజ్రేకర్ ను తీసుకున్నారట. ఈమె ప్రముఖ నటుడు, పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన మహేష్ మంజ్రేకర్ కుమార్తె. ఈమె ఇటీవలే సల్మాన్ యొక్క ‘దబాంగ్ 3’తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే ఈమె ఎంపికపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే అల్లు బాబీ, సిద్దు ముద్దలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More