ప్రభాస్ ను తెగ పొగిడేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ !

ప్రభాస్ ను తెగ పొగిడేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ !

Published on Jun 27, 2018 8:28 AM IST

ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్, వివేక్ ఒబెరాయ్ తో పాటు ఇంకొంతమంది హిందీ నటీ నటులు నటిస్తున్నారు. వారిలో ఎవెలిన్ శర్మ కూడ ఒకరు. ఈమె కూడ ప్రభాస్ తో కలిసి దుబాయ్ షెడ్యూల్లో జరిగిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు.

ఈ విషయం గురించే ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆమె ప్రభాస్ ఒక జెంటిల్మెన్ అని కితాబిచ్చారు. అంతేకాదు ప్రభాస్ ఒక సూపర్ స్టార్ అని, కొంచెం పరిచయం ఏర్పడితే ఆయన ఎలాంటి మొహమాటం, బిడియం లేకుండా మాట్లాడతారని, ఆయనతో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉందని అన్నారు.

యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2019 వేసవికి విడుదలచేయనున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న తొలి చిత్రం కావడంతో అనేక పరిశ్రమల ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు