తెలుగులో బాలీవుడ్‌ భామ జరైన్ ఖాన్!

తెలుగులో బాలీవుడ్‌ భామ జరైన్ ఖాన్!

Published on Mar 10, 2015 1:08 AM IST

Zarinekhan
‘వీర్’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జరైన్ ఖాన్.. తెలుగు సినిమాలో నటించనుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జరైన్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. సుధీర్ రాజ్ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందనున్న సినిమాలో జరైన్ నటించనున్నట్లు సమాచారం. మొదటి సినిమా ఫలితమెలా ఉన్నా జరైన్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కత్రినా కైఫ్ పోలికలుండడం జరైన్‌కు కలిసివచ్చే అంశం.

జరైన్ కేవలం హిందీలోనే కాక తమిళంలో ‘కరికాలన్’ సినిమాలో విక్రమ్ సరసన నటించింది. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా అయిన ‘రెడీ’లో జరైన్ పాట, ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సాధారణంగా ఇక్కడి భామలు బాలీవుడ్‌కు పరిచయమవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ నుంచి ఇక్కడకొచ్చి నటించిన హీరోయిన్లూ ఉన్నారు. ఇప్పుడు వారి సరసన జరైన్ చేరనుంది.

తాజా వార్తలు