
ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ‘నాన్నకు ప్రేమతో’ షార్ట్ షెడ్యూల్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరున నాన్నకు ప్రేమతో టీం ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ‘జనత గ్యారేజ్'(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేయనున్నాడు. ఇటీవలే అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. కృష్ణా పుష్కరాల కానుకగా ఆగష్టు 12న రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసారని ఇది వరకే తెలియజేశాం.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, కొంచెం ఫ్రెష్ గా ఉండే హీరోయిన్స్ కోసం అన్వేషిస్తున్నామని కొరటాల శివ తెలిపాడు. తాజాగా ఈ చిత్ర టీం నుంచి అందిన వార్తల ప్రకారం బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే కొరటాల శివ అండ్ టీం పరిణీతి చోప్రాతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలిస్తే ఒక హీరోయిన్ గా పరిణీతి చోప్రా సెట్ అయిపోతుంది. అలాగే సెకండ్ హీరోయిన్ కోసం ఎవరన్నా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని పలువురుని పరిశీలిస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ వారు ర్ర్ సినిమాకి నిర్మాతలు.